![]() |
![]() |

బిగ్ బాస్ హౌస్ లో అయిదో వారం టాస్క్ లతో ఫుల్ ప్యాక్ డ్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. గత రెండు రోజుల నుండి టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి. అందుకు టీమ్ లుగా విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ అన్ని జంటలకి టాస్క్ ఇస్తాడు. రూమ్ లోకి వెళ్లి అక్కడ రెడ్ క్లాత్ పై ఉన్న ఐటమ్ ని గుర్తు పెట్టుకొని వచ్చి డ్రా చెయ్యాలి.. డ్రా చేసిన దాన్ని బట్టి తన టీమ్ మేట్ అదే ఐటమ్ వెళ్లి తీసుకొని రావాలి. అలా మొదటి రౌండ్ కి దివ్య గీసిన డ్రాయింగ్ చూసి భరణి కరెక్ట్ గా తీసుకొని వస్తాడు. రెండో రౌండ్ కి సంజన డ్రా చేయగా ఫ్లోరా కరెక్ట్ గా తీసుకొని వస్తుంది.
మూడో రౌండ్ కి సుమన్ డ్రా చెయ్యగా శ్రీజ కరెక్ట్ గా తీసుకొని వస్తుంది. నాలుగో రౌండ్ కి డీమాన్ పవన్ డ్రా చెయ్యగా రీతూ కరెక్ట్ గా తీసుకొని వస్తుంది. చివరగా గెలవకుండా మిగిలింది తనూజ, కళ్యాణ్ టీమ్. వాళ్ళు స్కోర్ బోర్డు లో చివరగా ఉంటారు. నాలుగో స్థానంలో సుమన్, శ్రీజ. మూడో స్థానంలో రీతూ, పవన్, రెండో స్థానంలో సంజన, ఫ్లోరా మొదటి స్థానం లో భరణి, దివ్య ఉంటారు. ఇక టాస్క్ పూర్తయ్యాక ఇమ్మాన్యుయల్ స్కోర్ బోర్డు చూస్తూ కామెడీ చేశాడు.
టీవీలో శ్రీ చైతన్య, నారాయణ రిజల్ట్స్ వచ్చినప్పుడు చేసే యాడ్ లా స్పూఫ్ ఇరగదీశాడు ఇమ్మాన్యుయల్. స్కోర్ బోర్డు పై స్థానాలని చెప్తు అందరిని కడుపుబ్బా నవ్వించాడు. సుమన్ శెట్టి పాయింట్స్ లో ప్రభంజనం.. అయిదో స్థానం నుండి నాలుగో స్థానానికి మారడం.. ఇది సుమన్ అన్నకే సాధ్యమంటూ మొదలెట్టాడు.. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి.. జయం సినిమాలో తన కామెడీతో జయం పొంది.. తెలుగు సినిమా రంగంలో కామెడీయన్ గా ఎదిగాడు.. ఇక తమిళ, మలయాళ, కన్నడ బాషల్లో నటించిన అతను.. బిగ్ బాస్ నుండి రింగ్(ఫోన్ కాల్) రాకపోయినా.. తనే రింగ్(బిగ్ బాస్ కి కాల్ చేసి) ఇచ్చి ఇక్కడికి వచ్చి.. తన టార్గెట్ అంతా ఆ కిరీటం మీదే పెట్టుకున్నాడంటూ ఇమ్మాన్యుయల్ చేసిన స్పూఫ్ నెక్స్ట్ లెవెల్ అంతే.. ఇది బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. సుమన్ శెట్టి ఓ టాస్క్ లో గీసిన కిరీటం చూసిన బిగ్ బాస్.. సుమన్ శెట్టి మీరు గీసిన డ్రాయింగ్ అచ్చం నిజమైన కిరీటంలానే ఉందని అన్నాడు. దాంతో హౌస్ అంతా కడుపుబ్బా నవ్వేశారు.
![]() |
![]() |